వరద బాధితులకు చేయూతగా విశ్వోదయ సంస్థల వితరణ

 వరద బాధితులకు చేయూతగా విశ్వోదయ సంస్థల వితరణ 

          సమాజంలో ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తమ వంతుగా చేయూత నివ్వడంలో విశ్వోదయ మొదటి నుండి ముందంజలో ఉంటుంది. ఇటీవల విజయవాడ పరిసర ప్రాంతంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన భారీ ప్రాణ,ఆస్తి,పంట నష్టాలకు చేయూతగా విశ్వోదయ విద్యాసంస్థలు ఈరోజు (17/10/2024) గౌరవనీయులైన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ విరాళాన్ని స్వచ్ఛందంగా విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల, జవహర్ భారతి  జూనియర్ కళాశాల, జవహర్ భారతి డిగ్రీ కళాశాల మరియు జవహర్ భారతి నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమకూర్చారు. ఈ చెక్కును జవహర్ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి.సుబ్రహ్మణ్యం నాయుడు గారి చేతులమీదుగా ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగినది. వీరితో పాటు స్వయం ఉపాధి కోర్సుల డైరెక్టర్ డాక్టర్.ఆర్. మల్యాద్రి గారు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  శ్రీ శామ్యూల్ రాజ్ గారు, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి బ్యూలా గారు,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శ్రీ.పి.నాగేశ్వరరావు గారు, శ్రీ.ఎస్ కె అయూబ్ అహ్మద్ గారు మరియు డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ శ్రీ.కె.బ్రహ్మానందం గారు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 

విశ్వోదయ విద్యార్థినీవిద్యార్థులను మరియు యాజమాన్యంను ఎం.ఎల్.ఏ గారు అభినందించారు.



google+

linkedin