పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 09-12-2024
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆదివారం రాత్రి పలు కార్యక్రమాలు పాల్గొన్నారు. కావలి పట్టణానికి చెందిన వేలూరి జనార్ధన నాయుడు - అనసూయ దంపతుల కుమారుడు కళ్యాణ్ రిసెప్షన్ ఆదివారం జమ్మలపాలెంలోని కెవిఆర్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కావలికి పట్టణానికి చెందిన వంగవరపు శ్రీనివాసులు రెడ్డి - అపర్ణ లక్ష్మి దంపతుల కుమారుడు భువన్ తేజ రెడ్డి వివాహ రిసెప్షన్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బోగోలు మండలం కోవూరుపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన టీడీపీ కార్యకర్త అమూల్ సాల్మన్ ప్రమాదంలో గాయపడి కావలి పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేసుకొని చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు హాస్పిటల్ కు వెళ్లి ఆయనను పరామర్శించారు. అతని ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటానని వారికి తెలిపారు.