క్రీస్తు ప్రార్ధనలో పాల్గొన్న ఎమ్మెల్యే..

 క్రీస్తు ప్రార్ధనలో పాల్గొన్న ఎమ్మెల్యే..

19వ వార్డు షారోను బాపిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు.. 

పాస్టర్స్,చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

కావలి పట్టణం19వ వార్డు బుడుమగుంట రైల్వే గేట్ దగ్గర,ప్రశాంత నగర్ లో షారోను బాపిస్ట్ చర్చిలో  క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు.ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం.ప్రేమ,కరుణ,సహనం, దయ,త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం.సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం...



google+

linkedin