కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయం - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కావలి పట్టణం రామిరెడ్డి తోటలో నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంచలంచెలుగా ఎదిగానని, రైతు బిడ్డగా రైతుల కష్టాలు, సాధారణ ప్రజల కష్టాలు తెలుసన్నారు. కావలిని అభివృద్ధి చేయడమే ధ్యేయమని తెలిపారు. కులాన్ని రాజకీయాలకు ఆపాదించవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలని కోరారు.