రోడ్డు ప్రమాద మృతులకు నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే
పిడుగురాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన తుళ్లూరి సురేష్ (37), ఆయన భార్య తుళ్లూరి వనిత(32), ఉప్పాల ఏబులు (65), కావలి పట్టణంలోని వైకుంఠపురం కు చెందిన తాత పెద్ద తిరుపతయ్య (50) భౌతిక కాయాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు సోమవారం దర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త చనిపోవడంతో వారి నివాసం వద్ద హృదయ విధారక ఘటనకు ఎమ్మెల్యే చలించిపోయారు. సురేష్ పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు..