కప్పరాల తిప్ప గ్రామంలోని బాడన్ పేట తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే

 బోగోలు మండలం కప్పరాల తిప్ప గ్రామంలోని బాడన్ పేట తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన చర్చ్ సభ్యులు మరియు గ్రామస్తులు...ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు.ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం.ప్రేమ,కరుణ,సహనం, దయ,త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం.సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం...



google+

linkedin