ఎమ్మెల్యే ఇంట సందడి చేసిన జబర్దస్త్ నటులు
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఇంట జబర్దస్త్ నటులు ఆదివారం సందడి చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన వారు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయనతో కలిసి అల్పాహార విందు చేశారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది, రైజింగ్ రాజు, బుల్లెట్ భాస్కర్, నరేష్, దొరబాబు, శాంతి, తదితరులు పాల్గొన్నారు..