కావలిలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు..
రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..
ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుండి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
సెల్ఫీ పాయింట్ వద్ద కరచాలను చేస్తూ విద్యార్థులతో సెల్ఫీలు దిగిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
ఇక్కడకు విచ్చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు భవిష్యత్తు మీది.. దేశం మీది..దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే..
మార్పు మీ ఇంటి నుండి మొదలు పెట్టండి..
మీ తల్లిదండ్రులు బైక్ తీస్తుంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలని స్వీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పండి..
ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించండి..
జాతీయ జెండా నీడన మనం బతుకుతున్నాం..
భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించండి.. భారతీయులుగా గర్వించండి..