పడినప్పుడే ఎలా నిలబడాలో నేర్చుకుంటాము - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
జీవతమనేది ఒక పోరాటమని, పడినప్పుడే ఎలా నిలబడాలో నేర్చుకుంటామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు. కెకెఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ విజేతలకు గురువారం రాత్రి ఆయన బహుమతులను అందజేశారు. విజేతలైన టీమ్, తన పొలిటికల్ టీమ్ కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఎమ్మెల్యే గారు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని, గెలిస్తే గర్వ పడటం, ఓటమి చెందితే కుంగి పోవడం చేయరాదన్నారు. మనసును ఏకాగ్రతగా ఉంచుకుంటే విజయం లభిస్తుందని తెలిపారు. కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపారు. కష్టపడందే విజయం దక్కదన్నారు. జీవితంలో ఏదైనా మొదట సుఖాన్ని ఇచ్చేది చివరకు దుఖాన్ని మిగులుస్తుందని, అదే కష్టాలతో ప్రారంభం అయితే విజయాలతో, సుఖాలతో ముగుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకొని విజయానికి నాంది పలకాలని కోరారు. టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, స్థానిక వార్డు ఇంచార్జి ప్రళయకావేరి మల్లికార్జున, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు...