బోగోలుకు పూర్వ వైభవం తీసుకొస్తాను - కావలి MLA దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
బోగోలుకు పూర్వ వైభవం తీసుకొస్తానని, అందరి చూపు బిట్రగుంట వైపు ఉండేలా చేస్తానని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. బోగోలు పంచాయతీ కుమ్మరి వీధిలో యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే కు యువత ఘన స్వాగతం పలికారు. ముగ్గుల పోటీలు, వంటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోగోలు, విశ్వనాధరావుపేట అనుసంధానం అయ్యేలా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. కుమ్మరి గేట్ ను అండర్ పాస్ గా ప్రారంభించనున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సహకారంతో రైల్వే అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తానని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం బోగోలులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, బోగోలు లో త్వరలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టనున్నామని అన్నారు. హిందూ స్మశానంను అభివృద్ధి చేస్తానని, చెరువులో గుండా చెంచులక్ష్మిపురం వెళ్ళడానికి బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, చిలకపాటి వెంకటేశ్వర్లు, సుధీర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..