ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత 

నారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందిన 10 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.9,88,831 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం అందజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ టిఆర్ వైద్యసేవ కిందకు రాని పలు ఆరోగ్య సమస్యలకు వివిధ హాస్పిటల్ లలో చికిత్సలు పొందటం జరిగిందని, వారికి ఇంటి పెద్ద బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు..








google+

linkedin