కలెక్టర్ పర్యటన నేపథ్యంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జనవరి 28న కావలి లో కలెక్టర్ పర్యటన నేపథ్యంలో ప్రారంభోత్సవం కానున్న పలు పనులను, కావలి పట్టణంలో ఉన్న పలు సమస్యలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం పరిశీలించారు. వెంగలరావు నగర్ లోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపారు. కావలి కొత్త శివాలయం నుండి ఇందిరమ్మ కాలనీ, అక్కడ నుండి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి మీదుగా ముసునూరు కనెక్టివిటీ ని పరిశీలించారు. అనంతరం శిదిలావస్థ లో ఉన్న ఉర్దూ ఘర్, షాదీ ఖానా ను పరిశీలించారు. తీసుకోవలసిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వంటేరు వరదారెడ్డి పార్క్ ను పరిశీలించారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు నడవడానికి వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయవలసినదిగా అధికారులను ఆదేశించారు. అనంతరం మినీ స్టేడియం పరిశీలించారు. 30 అడుగుల వెడల్పులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, డిఈ సాయి రాం, టీపీవో వివేకానంద, తదితరులు పాల్గొన్నారు.