శిలా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో అశ్వద్ద నారాయణ కళ్యాణం మరియు జంట నాగుల శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. నాగుల శిలా ప్రతిష్టకు విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానికులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. త్వరలో రూ.1 కోటి 70 లక్షలతో ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు వేయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, ఉప్పుటూరి బాలగురు స్వామి, ద్రోనాదుల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు..