కావలి పట్టణంలో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
కావలి పట్టణంలో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
వంద అడుగుల స్థూపం పై జాతీయ జెండా ఆవిష్కరించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఆర్డీవో వంశీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్,కావలి తాసిల్దార్ శ్రవణ్ కుమార్,పోలీస్ అధికారులు,ప్రజా ప్రతినిధులు..
ఆకట్టుకున్న బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు...
సెల్ఫీ మామగా పిలుచుకునే ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డ చిన్నారులు..
ఎమ్మెల్యే కామెంట్స్..
సెల్ ఫోన్.. సైన్స్.. ఉద్యోగాలపై మక్కువతో దేశభక్తిని మర్చి పోతున్నాం..
జండా నీడన మనం స్వేచ్ఛగా ధైర్యంగా బతుకుతున్నాం..
3 కోట్ల మంది ఆత్మ తర్పణం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది..
1950 జనవరి 26 రాజ్యాంగం పుట్టినరోజే గణతంత్ర దినోత్సవం..
మహనీయుల త్యాగాల ఫలితలను మరువ వద్దు..
కాస్మోపాలిటన్ సిటీగా కావలి రూపాంతరం
సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వాల ప్రణాళికలు, అధికార యంత్రాంగం సహకారంతో కావలి కనక పట్టణంగా...కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం తధ్యం
జల...వాయు...ఉపరితల రవాణా మార్గాలు (రామాయపట్నం పోర్ట్, ఫిషింగ్ హార్బర్, త్వరలో రానున్న దా మవరం పోర్ట్, no 16 హైవే, రైల్వే లైన్) అనుసంధానమై ఉన్న కారణంగా అందుబాటులో వేగవంతమైన రవాణా వ్యవస్థ
లక్ష మందికి ఉపాదినిచ్చే 125000 కోట్ల రూపాయల బిపిసిఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కు జూన్...జులై నెలల్లో శంఖుస్థాపన జరిగే అవకాశం
ఇండోసెల్ తోపాటు మరికొన్ని పారిశ్రామిక సంస్థలు కార్యకలాపాలకు సిద్ధం
ప్రాజక్టులన్నీ ప్రారంభమైతే ప్రస్తుత కావలి జనాభా 1.5 లక్షల నుంచి 7.5 లక్షలకు చేరుకునే అవకాశం, జాతీయ, అంతర్జాతీయ సంస్థల రాకతో కాస్మో పాలిటన్ నగరంగా రూపుదిద్దుకోవడం, బ్రహ్మంగారు చెప్పిన కనక పట్టణ జోస్యం సాకారం కావడం తధ్యం
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
సాగునీరు...మంచినీరు, రోడ్లు మురుగునీరు ఇలా అన్ని వ్యవస్థలన్నీ ప్రజలకు అవసరమైన రీతిలో తీర్చి దిద్దడం లక్ష్యం
పెద్ద పవని రోడ్డుకు రైల్వే అండర్ పాస్, ఫైర్ ఆఫీస్ రోడ్ ఎదురుగా వెంగళరావు నగర్ ను అనుసంధానం చేస్తూ ఆర్ ఓ బి నిర్మాణానికి డిపిఆర్ లు సిద్ధం, త్వరలో కార్యరూపంలోకి
వెంగళరావు నగర్-ఇందిరమ్మ కాలనీ-ముసునూరును అనుసందానిస్తూ అంతర్గత వలయ రహదారి నిర్మాణం
ఉదయగిరి రోడ్డు ను కలుపుకుని పట్టణ పడమటి వైపు నుంచి ముసునూరు పై తట్టు నుంచి జాతీయ రహదారి కి కలుపుతూ బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు, కేంద్ర మంత్రి గట్కరికి ప్రతిపాదనలు... త్వరలో ఆమోదం పొంది కార్య రూపంలోకి
56 కోట్లతో చేపట్టిన అమృత్-1 పనులు పూర్తి చేసి 7500 నివాసాల కు కొత్తగా కుళాయి కనెక్షన్, అమృత్-2 ద్వారా మంచినీటి సమస్యలకు సమగ్ర పరిష్కారం
జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి సమస్యే లేని గ్రామ సీమల లక్ష్యం
సాగునీటి పరంగా నియోజకవర్గాన్ని డెల్టాగా తీర్చిదిద్ది ప్రతి రైతు మోములో ఆనందం చూడడమే లక్ష్యం
పట్టణంలో 16 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణానికి కసరత్తు, మరిన్ని రోడ్లకు ప్రతిపాదనలు
రూరల్ ప్రాంతంలో 27 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం, ఇది జిల్లాలోనే ఫస్ట్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం చంద్రబాబు, dy సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో...అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని నియోజక వర్గాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు.
గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆర్డీవో కార్యాలయం, 100 ఫీట్ ఐకాన్ సెంటర్ లో ప్రసంగించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు