కావలి పట్టణంలో కలుగోలమ్మ తిరుణాళ్ళలో భాగంగా స్నేహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు

 కావలి పట్టణంలో కలుగోలమ్మ తిరుణాళ్ళలో భాగంగా మంగళవారం రాత్రి స్నేహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్నేహ యూత్ సభ్యులు  ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవత కలుగోళ శాంభవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు.మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్ గారి ఆశీస్సులతో కావలి కనకపట్నం కాబోతుందని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారన్న నమ్మకంతో చంద్రబాబు అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారని అన్నారు. మీరు వేసిన ఓటు వృధా కాకుండా మంచి పాలన అందిస్తానని, కావలి ని కాపు కాస్తానని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న స్నేహ యూత్ ను ఎమ్మెల్యే అభినందించారు.























google+

linkedin