మారణాయుధాలతో దాడి చేస్తే అడ్డుకోవడం తప్పా?
- అధికారం కోల్పోయినా వైసీపీ నేతల ఆగడాలు మాత్రం తగ్గటం లేదు
- మాకు రక్షణ కల్పించడం కోసం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి
- కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మాజీమంత్రి కాకాణికి లేదు
- కోళ్లదిన్నె ఘటనపై మండిపడ్డ బాధితులు, టిడిపి శ్రేణులు
నిత్యం రోగులతో కిటకిటలాడే కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోకి మారణాయుధాలతో వచ్చి, భయకంపితులను చేస్తూ తమపై దాడి చేయబోతే ఆత్మ రక్షణ కోసం అడ్డుకోవడం తప్పా? అని బోగోలు మండలం ఏనుగుల బావి పంచాయతీ కోళ్లదిన్నె గ్రామ బాధితులు ప్రశ్నించారు. సోమవారం బాధితులు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కావలి టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు, టీడీపీ నేతలు మాట్లాడారు. గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ ఫ్లెక్సీ కి అడ్డుగా వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయదలచారని, దానిని వారించినందుకు గ్రామంలో మాపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. గాయపడిన మేము చికిత్స పొందటం కోసం కావలి ఏరియా వైద్యశాలకు రావడం జరిగిందని, కత్తులు, కొడవళ్ళతో మాపైకి దాడికి రావడం జరిగిందని, మా ప్రాణాలను రక్షించుకోవడానికి వారిని అడ్డుకునే క్రమంలో ఘర్షణ జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున రోగులు ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలోకి మారణాయుధాలతో ప్రవేశించి, మా పైనే దాడికి పాల్పడటం దుర్మార్గం అని అన్నారు. అధికారం కోల్పోయినా వైసీపీ నేతల దౌర్జన్యాలు తగ్గడం లేదని, ఇంకా తమ హవా చూపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలోనూ మా గ్రామంలోని టీడీపీ నాయకులపై దాడులు చేయడం జరిగిందని, తిరిగి మాపైనే కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 2019-24 మధ్య కాలంలో ప్రశ్నించినా, ఫ్లెక్సీ కట్టినా, చిన్న కార్యక్రమం చేపట్టిన కేసులు నమోదు చేశారని, వేధించారని వాపోయారు. వైసీపీ నేతలది దాడుల సంస్కృతి అని విమర్శించారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేసి, నెపాన్ని టీడీపీ వారిపై నెట్టడానికి ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు. మా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి వైసీపీ నేతల నుండి మాకు రక్షణ కల్పించాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లకు లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రం ముందుకు నడుస్తుందని తెలిపారు. కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన నాయకుడని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడరని తెలిపారు. అదేవిధంగా శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కూడా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రశాంత కావలి నియోజకవర్గం లో చిచ్చురేపవద్దని, మీ అరాచకాలను సాగనివ్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోళ్లదిన్నె గ్రామ బాధితులు, కావలి టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, దావులూరి దేవ కుమార్, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, బోగోలు మండల ప్రధాన కార్యదర్శి సుధీర్, కోడూరు వెంకటేశ్వర రెడ్డి, వెంకారెడ్డి, రావి విజయ్, పైడి శ్రీహర్ష, ప్రసన్న, తిరివీధి ప్రసాద్, వల్లూరి వెంకట కిరణ్ కుమార్, బాధిత కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..