మహా చండీ యాగంకు ఆహ్వానం

 మహా చండీ యాగంకు ఆహ్వానం 

శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న మహా చండీ యాగానికి విచ్చేయవలసిందిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు పత్రి వీర బ్రహ్మయ్య స్వామి శనివారం ఆహ్వానించారు. మహా చండీ యాగం కు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజు వారి చింతలపాలెంలోని శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠం లో  నిర్వహించే కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మహా చండీయాగం విశిష్టతను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాజువారి చింతలపాలెం టీడీపీ సీనియర్ నాయకులు గుంటూరు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు...





google+

linkedin