యువగళం తో నారా లోకేష్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు
- లోకేష్ భావి ముఖ్యమంత్రి అయ్యేలా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం
- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
యువగళం తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రజల్లో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపారని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా, పండుగలా నిర్వహించారు. భారీ కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు శాసనసభ్యులు తినిపించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి, ప్రజలకు భరోసా, నమ్మకం కల్పించడానికి నాడు లోకేష్ యువగళం కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. యువగళం పాదయాత్ర చేపట్టి వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, వాటికి నేడు పరిష్కారం చూపుతున్నారన్నారు. కోటి సభ్యత్వాలు జరిగాయాంటే అది లోకేష్ కృషి అని తెలిపారు. సభ్యత్వాలు తీసుకున్న వారిలో ఎక్కువ మంది యువత ఉండటం లోకేష్ పై రాష్ట్రంలోని యువత పెట్టుకున్న ఆశలకు నిదర్శనమని తెలిపారు. లోకేష్ ను భావి ముఖ్యమంత్రిని చేసే విధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.