ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
గ్రామస్తుల కోరిక తీర్చిన ఎమ్మెల్యే..
నారాయణపురం గ్రామస్తులు,నాయకులతో కలిసి బస్సు ఎక్కి ప్రయాణించిన ఎమ్మెల్యే..
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, గ్రామస్తులు..
నారాయణపురం గ్రామంలో నారాయణస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అంటున్న గ్రామస్తులు..
దగదర్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను తీర్చిన ఎమ్మెల్యే. కావలి నుంచి దగదర్తి మండలం నారాయణపురం, అనంతపురం,దామవరం మీదగా నెల్లూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సును సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసిన ప్రారంభించారు.బస్సు ఎక్కి టికెట్ తీసుకొని కార్యకర్తలు గ్రామస్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని,దీన్ని ప్రజలు, విద్యార్థులు, రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఎమ్మెల్యే గారు కోరారు....