నేతాజీ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దగుమాటి

- టిడిపి కార్యాలయంలో ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌  జయంతి వేడుకలు కావలి టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హింసావాదంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడన్నారు. ఇందుకోసం ఆజాద్ హింద్ పౌజ్ స్థాపించారని అన్నారు. దేశంలో ఎనలేని చైతన్యం తీసుకువచ్చిన నేత నేతాజీ అని తెలిపారు. నిబద్దత కలిగిన నిస్వార్థ, స్ఫూర్తిదాయకమైన నాయకుడు నేతాజీ అని తెలిపారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకోవాలని, మనం నమ్మిన దానికోసం అందరికి ఉపయోగాపడే దానికోసం మనస్పూర్తిగా మన శాయశక్తుల ప్రయత్నించాలని, వెనకడుకు వెయ్యరాదని అన్నారు.


google+

linkedin