కావలి పట్టణంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కావలి పట్టణములోని బ్రిడ్జి సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బుధవారం పెద్ద ఎత్తున అధికారులు, అనధికారులు ప్రజలు, కూటమినేతలు కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. బొకేలు, శాలువాలు, దండలు చాలా వరకు నిషేధించడంతో సామాన్య ప్రజలు సైతం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పటానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయనని, కావలిని కనకపట్నం చేసి తీరుతానని తెలిపారు.