ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తాను
- రాష్ట్రాన్ని ప్రగతిపథంలో చంద్రబాబు నడిపిస్తున్నారు
- రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసిన కావలి శాసనసభ్యులు
ఎన్టీఆర్ సేవలు ఎనలేనివని, వారి ఆశయ సాధనకు కావలి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కావలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు వైకుంఠపురం లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రక్తదానం చేసి అందరినీ రక్తదానం చేసేలా ప్రేరేపించారు. ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి రోజున నేను రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయుటకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని అన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేసింది, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన దేవుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సహకారంతో, టీఆర్ స్ఫూర్తితో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..