కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో ఫైర్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు ఫైర్ యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ పోటీలు, కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని తెలిపారు. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాగే పోటీలు నిర్వహించాలని, అందరి మన్ననలు పొందాలని కోరారు..