కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన కలుగోల శాంభవి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున బాణా సంచా పేల్చి ఎమ్మెల్యే పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ. 5 లక్షలు అందజేస్తానని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు..