దగదర్తి మండలం మనుబోలుపాడు కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. శుక్రవారం లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వ కార్డును కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకున్న రవికుమార్ చౌదరి ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు అభినందించారు.