గ్రామాల్లోని అన్ని రోడ్లను సిసి రోడ్లుగా మారుస్తాం
- ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తాము
- సబ్సిడీ పై వచ్చే బోట్లకు మత్స్యకారులు దరఖాస్తు చేసుకోండి
- సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
గ్రామాల్లో ఉన్న అన్ని మట్టి రోడ్లను త్వరలోనే సీసీ రోడ్లుగా మారుస్తామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు. ఆదివారం కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట, అన్నగారిపాలెం పంచాయతీ ల్లో పలు సిమెంట్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఉదయం ప్రారంభం అయిన శంకుస్థాపనల కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. ప్రతి గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి విచ్చేసిన ఆయన దారి పొడవునా జననీరాజనాలు అందుకున్నారు. కొత్తసత్రం హరిజనవాడ లో 10 లక్షలు, చిన రాముడు పాలెంలో 20 లక్షలు, తుమ్మలపెంట పల్లిపాలెంలో 67.40 లక్షలు, తుమ్మలపెంట బి కెనాల్ నుండి బీచ్ రిసార్ట్ వరకు 55 లక్షలు, తుమ్మలపెంట పట్టపుపాలెం లో 42.60 లక్షలు, నడింపల్లి లో 12.40 లక్షలు, ఒట్టూరు లో 25 లక్షలు, వెంకటేశ్వరపురం లో 90 లక్షలకు సంబందించిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ప్రతి చోట ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. వెంకటేశ్వరపురంలో బోగి మంటలు వేసి భోగి శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మలపెంట రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. తుమ్మలపెంట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఇకపై గ్రామ బాధ్యత నాదని తెలిపారు. గత వైసీపీ ఐదేళ్ల పాలన అధ్వానంగా సాగిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరందించే కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తామని తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు వరమని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ పై ఇచ్చే బోట్లకు మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, నాయుడు రాంప్రసాద్, పాలడుగు రంగారావు, బోట్లగుంట శ్రీహరి నాయుడు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడివో శ్రీదేవి, ఎపివో పెంచలమ్మ, పంచాయతీ రాజ్ ఈఈ వేణుగోపాల్, డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ సుబ్రహ్మణ్యం, రూరల్ సిఐ రాజేశ్వరరావు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు...