దేవుని చల్లని చూపు ప్రజలపై ఉండాలి
దేవుని చల్లని చూపు కావలి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.
శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆయన కుమార్తె సంహిత రెడ్డి, అల్లుడు బినీత్ రెడ్డి తో కలిసి కావలి పట్టణం బృందావనం కాలనీ లోని వెంకటేశ్వర స్వామిని, విష్ణాలయం వీధిలోని లోని విష్ణు మూర్తిని, బోగోలు మండలం కొండబిట్రగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తీర్ధ, ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి విశిష్టత ను తెలియజేసారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.