గ్రంధి సేవలు మరువలేనివి - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 గ్రంధి సేవలు మరువలేనివి 

తన జీవితం ప్రజా సేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి గ్రంధి యానాది శెట్టి. సొంత నిధులతో గ్రంధి యానాది శెట్టి కాంస్య విగ్రహం నిర్మించడం నాకు చాలా సంతోషం గా వుంది..

-కావలి శాసనసభ్యులు  దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా, కావలి : కావలి అభివృద్ది కోసం ప్రతీక్షణం పరితపించి,తన జీవితాంతం  ప్రజా సేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి గ్రంధి యానాది శెట్టి ఆని ఆయన కావలి అభివృద్ది కోసం  చేసిన కృషిని కావలి ప్రజలు ఎన్నడు మరువరాని ఎమ్మెల్యే

దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు...శుక్రవారం కావలి పట్టణంలోనే  పొట్టి శ్రీరాములు  విగ్రహం సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు లో గ్రంధి యానాది శెట్టి  కాంస్య విగ్రహం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు...ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా స్వర్గీయ గ్రంధి యానాది శెట్టి కుటుంబ సభ్యులు,టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు... అనంతరం వారు మాట్లాడుతూ...గ్రంధి యానాది శెట్టి  రాజకీయ ప్రస్థానం 1987లో కాంగ్రెస్ తరఫున పురపాలక కౌన్సిలర్గా గెలుపొంది వైస్ఛైర్మన్ కొనసాగారు. 1995 నుంచి 2000 వరకు వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆ తరువాత 2000 నుంచి 2005 వరకు ఛైర్మన్ గా.. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన ఎల్లవేళలా  ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలోనే కొనసాగడం జరిగిందన్నారు... కావలిలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రంధి నీ కోల్పోవడం దురదృష్టకరమన్నారు.. అలాంటి మహోన్నత వ్యక్తి గ్రంధి యానాదిశెట్టి     విగ్రహాన్ని నా సొంత నిధులు తోటి నా చేతుల మీదగా నిర్మించడం పూర్వజన్మ సుకృతమని  ఎమ్మెల్యే అన్నారు.... అంతేకాకుండా నా ఆధ్వర్యంలో కావలికి వెళ్లలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నా రాజకీయ గురువు మా తల్లి మాజీ ఎంపీ,మాజీ కావలి ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ మాగుంట పార్వతమ్మ పేరులు కావలి ట్రంకు రోడ్డుకు నామకరణ చేయడం నా అదృష్టం అన్నారు...వారి అడుగుజాడలలో  నడుస్తూ కావలి రూపురేఖలు మార్చి కనకపట్నం చేసేందుకు  రాయి శక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు

గ్రంధి యానాదిశెట్టి 

అభిమానులు పాల్గొన్నారు .

google+

linkedin