కావలిలో అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం..

 కావలిలో అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం..

మున్సిపల్ అధికారులతో కలిసి కావలి పట్టణం 10వ వార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

కావలి పట్టణం 'స్వచ్ఛ్ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' లో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

విద్యార్థులు,మున్సిపల్ సిబ్బంది ప్రజలతో కలిసి 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' జండా ఊపిరి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే..

తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త సేకరణకు మూడు రకాల ప్లాస్టిక్ బకెట్లు..

చెత్తకుండీలో చెత్తని వేయకుండా మూడంచల ఇనప కంచలో ఉంచేలా అవగాహన..

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

నెల్లూరు జిల్లా..కావలి పట్టణం 10వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని అధికారులు శనివారం కావలిలో  అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి హాజరయ్యారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు, ప్రజా ప్రతినిధులు,పారిశుధ్య కార్మికులు,విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రజలకు డస్ట్ బిన్నులు పంపిణీ చేశారు. అనంతరం  శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశను దేశంలోనే అత్యంత పరిశు భ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇకపై ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ దివస్‌గా జరుపుకోవాలన్నారు.. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని  మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో  మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు...చెత్త కలెక్షన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. పొడి, తడి చెత్తను వేరు చేయడం ద్వారా ఆ చెత్తను ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. చెత్త నుండి బయోగ్యాస్, విద్యుత్తు వంటి ఉపయోగకరమైన వస్తువులను తయారుచేసే విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో కావలి మున్సిపాలిటీ DE సాయిరాం, ఆర్ ఐ,పని కుమార్, హెల్త్ ఆఫీసర్ బషీర్,టిడిపి నాయకులు కల్లగుంట మధుబాబు నాయుడు,వల్లేరి వెంకట కిరణ్ కుమార్,షేక్ అలహర్,వై వెంకటేశ్వర్లు,బి సారథి,అభిషక్,వి అద్రిజ తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin