శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
నెల్లూరు జిల్లా..కావలి పెద్ద చెరువు వద్ద కూచి చినమాలకొండ క్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది.కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,స్వామివారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రాంగణలో తొండపు సుబ్బరామయ్య నాయుడు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన శాశ్వత మంచినీటి కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మంచినీరు అందజేశారు..అనంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం దివ్య పరిణయోత్సవం వైభవోపతంగా నిర్వ మూడు గంటలపైగా వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పులకించారు.భక్తుల కొంగు బంగారం,కావలి వాసుల ఆరాధ్య దైవం కూచి చినమాలకొండ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.శుభ ముహూర్త సమయంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామస్మరణల మధ్య కల్యాణోత్సవం జరిగింది. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతిఘట్టం భక్తజనులను పరమానందభరితుల్ని చేసింది.స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులను కంకణధారణ, పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగల్యధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనులపండువగా సాగింది. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు.వేద పండితులు,అర్చకస్వాములు కల్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరార్ధాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు...ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కల్లగుంట మధుబాబు నాయుడు,కావలి 26వ వార్డ్ ఇంచార్జ్ గంగినేని వెంకటేశ్వర్లు,దామా మాల్యాద్రి, తిరువీధి ప్రసాద్,జనిగర్ల మహేంద్ర యాదవ్,తదితరులు పాల్గొన్నారు...