నూతన పాఠశాల భవనమును ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,బచ్చు కృష్ణ కుమార్ ,సంధ్య దంపతులు.
పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, నిర్మాణ దాతలు అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.
బచ్చు చారిటబుల్ ట్రస్ట్ సహకారం వెలకట్టలేనిది ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.
నెల్లూరు జిల్లా..అల్లూరు మండలం నార్త్ ఆములూరు గొల్లపాలెంలో ఉన్న చైల్డ్ ఆశ్రమంలో అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన నూతన పాఠశాల భవనమును కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి,చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బచ్చు కృష్ణ కుమార్ ఆయన సతీమణి సంధ్య చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిధులకు చైల్డ్ ఆశ్రమ యాజమాన్యం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.ముందుగా పాఠశాల భవనమును ప్రారంభించి పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము ఎంత సంపాదించినా తమ వంతుగా పేద విద్యార్థులకు,అనాధాతనులకు సహకారం అందించాలని ఉద్దేశంతో తమ తండ్రి బచ్చు వెంకట కిష్టయ్య పేరుమీద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆశ్రమంలో చదువుతున్న పిల్లలకు అనుకూలంగా పాఠశాల భవనమును నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చైల్డ్ ఆశ్రమ వ్యవస్థాపకులు రామచంద్ర శరత్ బాబు, బచ్చు కృష్ణ కుమార్ వారికి అభినందనలు తెలియజేశారు.అలాగే ఎక్కడెక్కడో రైల్వే ట్రాక్లు మీద తిరుగుతున్న పిల్లలను, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను తన వంతుకు సారదీసి వారిని మంచి మార్గంలో ఉండేలా తీర్చిదిద్దుతున్న చైల్డ్ ఆశ్రమా వ్యవస్థాపకులు రామచంద్ర శరత్ బాబు ఈ సమాజంలో ఉండవలసిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు.
అనంతరం అమర బచ్చు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కృష్ణకుమార్ మాట్లాడుతూ అనాధ పిల్లలను చెడు మార్గం లోకి పోనివ్వకుండా వారిని చేరదీసి మంచి విద్య అందిస్తూ వారిని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దుతున్న శరత్ బాబుకు మా వంతుగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చామని ఆయన తెలిపారు.శరత్ బాబు ఇలాంటి సేవలు మరెన్నో చేస్తూ సమాజానికి ఉపయోగపడాలని ఆశ్రమ అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.అలాగే చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకులు శరత్ బాబు మాట్లాడుతూ ఈరోజు తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను ఎంతమందికి ఆశ్రయం ఇవ్వగలిగామంటే ఎంతోమంది దాసర సహాయ సహకారాలతోనే సాధ్యమైందని ఇలాంటి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆశ్రమం తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తున్నామన్నారు. అలాగే తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ఎవరన్నా ఉంటే నార్త్ ఆములూరు చైల్డ్ ఆశ్రమం కు తెలియజేస్తే మేము వారిని చేరదీస్తామన్నారు.
ఈరోజు బచ్చు వెంకట కిష్టయ్య పేరుమీద 9 క్లాస్ రూములు, ఒక లేబరేటరీ, కంప్యూటర్ రూమ్, లైబ్రరీ రూమ్, హెడ్మాస్టర్ రూమ్, రికార్డు రూమ్, రెండు హాలుతో కూడిన బిల్డింగ్ను వారి తండ్రి గారి పేరు మీద సుమారు కోటి 18 లక్షలు తో పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన బచ్చు కృష్ణ కుమార్ సతీమణి సంధ్యా గొప్ప మనసున్న వ్యక్తులని, వారు చేసిన ఈ సహాయం ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు బీద గిరిధర్,డాక్టర్ సాగర్, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, రేబాల శంకర్ రెడ్డి, ఊటు శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రత్తయ్య, నాయకులు, ఆశ్రమ అధ్యాపకులు, గ్రామస్తులు పాల్గొన్నారు