ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,జిల్లా కలెక్టర్ ఆనంద్..
కావలి పట్టణంలో నే వెంగళరావు నగర్ లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తో కలిసి శనివారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ ఆస్పత్రిలోని గదులను పరిశీలించారు.. వైద్యులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..