రైతన్నలకు అండగా నిలిచే ప్రభుత్వం మాదే.. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
ఆంద్ర రాష్ట్రములో నాడు నేడు..భవిష్యత్తులో ఇంకెప్పుడైనా రైతన్నలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ మనదే అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పేర్కొన్నారు.గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రైతన్నలకు గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని, దీంతో ఆంధ్రరాష్ట్రంలోని రైతన్నలను జగన్ మోహన్ రెడ్డిను ఓడించేందుకు కంకణం కట్టుకొని,కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో,చంద్రబాబు నాయుడుపై విశ్వాసంతో భారీ స్ధాయిలో కూటమి అభ్యర్దులైన తమను గెలిపించారని,వారి కోసం కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటి సి.ఎం.పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారని అన్నారు.
ముఖ్యంగా నేడు మంచి ప్రభుత్వంలో వరి వేసుకొని మంచి పంటలు వేసుకునే సమయములో నేడు పి.ఎ.సి.ఎస్.ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని,అయితే టెస్టింగ్ కోసంగా ప్రతి రైతు తన ధాన్యాన్ని తీసుకొని అగ్రికల్చరల్ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ చేసుకోవడం, తరువాత రైస్ మిల్లర్స్ బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమె వడ్లు తీసుకుపోయే పరిస్ధితి ఉంది.కానీ రైతులకు వడ్లు పట్టే కూలీలు నిర్ణయించడంలో పి.ఎ.సి.ఎస్.కు అధికారం ఇచ్చినందు వలన రైతులకు,పి.ఎ.సి.ఎస్.కు మధ్య సంబంధం లేని కారణంగా నేడు రైతన్నల పోలాలలోనే వడ్లు ఆగిపోయే పరిస్ధితి వచ్చిందని,తీరా రైతులు వడ్లు తీసుకొని రైస్ మిల్లుల దగ్గరకు వెళ్తే,మళ్ళీ మార్చిన్ టెస్ట్ చేసి ఎక్కువగా ఉంది, తరుగు ఎక్కుఅవగా తగ్గిస్తామని చెబుతున్నారని,ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ అధికారులు పూర్తిస్ధాయిలో స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని,సంబంధిత శాఖా మంత్రి పూర్తిస్ధాయిలో స్పందించాలని కోరారు.అలాగే ల్యాండ్ కన్వర్షన్ ద్వారా రెట్టింపు ఛార్జీలు చెల్లించి నష్టపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఒకేసారి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఉండేలా చేయాలని అసెంబ్లీలో కావ్య క్రిష్ణారెడ్డి ప్రశ్నించగా, దానికి సాను కూలంగా రెవెన్యూ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ స్పందించారు.