పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 16-04-25

 పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. కంచర్ల విశ్వేశ్వరరావు - కృష్ణకుమారి దంపతుల కుమార్తె హర్షిని వివాహం జమ్మలపాలెంలోని ఎస్వీఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణం ముసునూరు 14వ వార్డులో జరిగిన మంద చిన కోటయ్య ఉత్తర క్రియల కార్యక్రమం లో పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కావలి పట్టణం 7వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా కార్యదర్శి పేయల శ్రీలక్ష్మి గారి తల్లి గారు కోటమ్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే గారు శ్రీలక్ష్మి నివాసానికి చేరుకుని కోటమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రకాడ సానుభూతిని తెలిపారు.

google+

linkedin