అన్నదాతకు అండగా టీడీపీ రైతులు ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

అన్నదాతకు అండగా టీడీపీ రైతులు ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు యాభై శాతం రాయితీ పై వ్యవసాయ యంత్రాలు పంపిణి - ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి.

రైతులను ప్రోత్సాహిస్తూ అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో ని మండల వ్యవసాయ కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు 50% రాయితీపై  వ్యవసాయ యంత్రాలు పంపిణీ  కార్యక్రమం వ్యవసాయ అధికారుల  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కావలి రూరల్ మండలనికి చెందిన 20 మంది రైతులకు 3,80,000  సబ్సిడీతో ట్రాక్టర్ల వ్యవసాయ యంత్రాలను  అలాగే పదిమంది రైతులకు లక్ష 30 వేల రూపాయలు తో పైరు కు మందును పిచికారి చేసే పెట్రోల్ పంపులను  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్సిడీ యంత్రాలు పంపిణీ చేయకుండా  మోసం చేసిందన్నారు.. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  సంవత్సరం రోజుల్లోనే  రైతులకు అండగా నిలిసిందన్నారు. అన్నదాతలను ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా  అభివృద్ధి పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రైతులందరూ కూడా రుణపడి ఉన్నారన్నారు. కావలి రూరల్ మండలంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్క రైతుకి  సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ఇంకా ఎవరైనా రెండో విడతలో  సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.ఈరోజు ఇలాంటి మంచి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టడం రైతులకు ఒక వరం అన్నారు.. ఈ కార్యక్రమంలో తహసిల్దార్  శ్రావణ్ కుమార్ , ఎంపీడీవో శ్రీదేవి, టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు,, ఏగూరి  చంద్రశేఖర్, పలువురు టిడిపి నాయకులు,వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

google+

linkedin