రాష్ట్రం బాగుండాలంటే సీఎం గా చంద్రబాబు నాయుడు ఉండాలి
కావలి లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు
రాష్ట్రం బాగుండాలన్నా, భవిష్యత్ తరాలు బాగుండాలన్నా సీఎం గా నారా చంద్రబాబు నాయుడు ఉండాలని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ సారధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కావలి టిడిపి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా హాస్పిటల్ నందు రోగులకు, చికిత్స పొందుతున్న వారికి, గర్భిణీ మహిళకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో వెనుకడుగువేయని పోరాటపటిమతో, సాధించేవరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణద్రప్రదేశ్ గా మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో భాగంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీకి చంద్రబాబు సీఎం కావడం, కావలి నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా కావ్య క్రిష్ణారెడ్డి కావటం సంతోషంగా, గర్వకారణంగా ఉందన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యునతి కొరకు ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్రన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుగంటి అలేఖ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.