కావలి పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక వార్డులోని ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు పూర్తి చేయగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వివేకానంద పార్క్ లో జిమ్ ను ప్రారంభించారు. వార్డులో రెండు చోట్ల టీడీపీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కాలుష్యం లేని వాతావరణం ఉండాలని పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డును సందర్శిస్తానని అక్కడి సమస్యలు స్వయంగా తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు..
ఇంటింటికి ఎమ్మెల్యే.. సమస్య మీది పరిష్కారం మాది.. వినూత్న రీతిలో ఇంటింటికి వెళ్లి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా విద్యుత్ సమస్య గాని నీటి సమస్య గాని డ్రైనేజ్ సమస్య గాని రోడ్లు సమస్య గాని ఉంటే తక్షణ పరిష్కారమని తదితర అధికారులను వెంటబెట్టుకుని సమస్య చెప్పిన వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న ప్రియతమా శాసనసభ్యులు ఏ ఇంటికి వెళ్లిన బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు మునిపెన్నడు ఇలా ఎవరూ రాలేదయ్యా వచ్చిన మేము సమస్య చెప్పాలి అంటే భయభ్రాంతులతోటి చేసేవారు ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఆనందంగా ఉంది అని స్వాగతం పలుకుతున్న స్థానిక ప్రజలు ఇన్నేళ్లు ఇన్నేళ్లు ఎక్కడున్నావయ్యా ఇన్నాళ్లకు మా ఇంట వస్తున్నావయ్యా అని నువ్వు చల్లగా ఉండాలయ్య అనే దీవిస్తున్న పట్టణ ప్రజలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం.