రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వరించడం ఒక మహోన్నతమైన ఘట్టం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వరించడం ఒక మహోన్నతమైన ఘట్టమని, ఈ పదవి రవిచంద్రకి వరించినప్పటికీ ఇది కావలి ప్రజల యొక్క విజయంగా దీన్ని అభివర్ణిస్తున్నామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవిచంద్రకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు లోకేష్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కార్యకర్తల కోసం, కావలి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తికి ఈ పదవి వచ్చిన సందర్భంలో కావలి తెలుగుదేశం పార్టీ తప్పకుండా వాళ్ళని ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలి, వారిని సన్మానించాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సెల్ఫీ పాయింట్ సమక్షంలో వారికి పౌర సన్మానం చేయాలనేటువంటి ఒక సంకల్పానికి మేమందరం కూడా నడుం బిగించడం జరిగిందన్నారు. గ్రంధి యానాశెట్టి విగ్రహ ఆవిష్కరణ దగ్గర నుంచి ఆద్యంతం ఊరేగింపుగా సెల్ఫీ పాయింట్ దగ్గరికు వచ్చి అక్కడ పౌర సన్మానాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలను ఈ సందర్భంగా పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు. కావలికి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నేను, ఎమ్మెల్సీగా శాసన మండలిలో రవిచంద్ర కలిసి ఈ కావలి గళాన్ని, కావలి అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి రామలక్ష్మణులుగా ఉంటామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్న తరుణంలో వారిని మనందరం కూడా సన్మానించడం మన బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..