పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే
దగదర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాలు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నిర్వహించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాట్రాయపాడు గ్రామపంచాయతీలో రూ.24 లక్షలు వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, బాడుగుడి పాడు గ్రామపంచాయతీలో రూ. 11 లక్షల 20 వేల వ్యయతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయం బిల్డింగ్ కు ప్రారంభోత్సవం కార్యక్రమం చేశారు. అలాగే మనుబోలుపాడు గ్రామపంచాయతీలో రూ. 24 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, మారెళ్ళపాడు గ్రామ పంచాయతీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, దుండిగం గ్రామపంచాయతీలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, ఐతంపాడు పాతురులో రూ.5లక్షలు, ఐతంపాడు కొత్తూరులో రూ. 13 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, రంగసముద్రం గ్రామపంచాయతీలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, సిద్ధారెడ్డి పాలెంలో గ్రామ పంచాయతీలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, తిమ్మారెడ్డి పాలెం గ్రామ పంచాయతీలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు గ్రామపంచాయతీ లోని చెరువును గ్రామ కొలనుగా సుందరీకరణ చేయుటకు రూ.కోటి 75 లక్షల పనికి శంకుస్థాపన చేశారు. కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, చెన్నూరులో రూ.17.5 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ కు, రూ. 15.74 లక్షల వ్యయంతో నిర్మించిన పాల సీతలీకరణ కేంద్రానికి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆయా గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు సాదరసత్కారాల మధ్య ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు సుభిక్షంగా ఉండాలని గ్రామాల్లో అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాపారాలన్నీ దూరంగా పెట్టి సేవ చేయడానికి వచ్చాను అని తెలిపారు. మనకు నీరు సమృద్ధిగా రావడం కోసం ఆయకట్టు స్థిరీకరణ పై అసెంబ్లీలో మాట్లాడటం జరిగిందని తెలిపారు. డిఆర్, డియం ఛానల్ పనులు పూర్తయితే నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా, రెండు పంటలు పండించుకుంటూ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మిస్తామని, సిసి రోడ్లు పూర్తయిన గ్రామాల్లో డ్రైనేజీలను నిర్మిస్తామని తెలిపారు. ఇల్లు లేని పేదలు కాలనీల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కాలనీ ఇచ్చి తీరుతామని తెలిపారు. పెన్షన్ రాని వారికి త్వరలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మే నెలలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండల టిడిపి అధ్యక్షులు అల్లం హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి చేజర్ల ఇబ్రీన్, టిడిపి నాయకులు జలదంకి శ్రీహరి నాయుడు, కండ్లగుంట మధుబాబు నాయుడు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..