కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన దానం అంకయ్య మంగళవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఉగాది పురస్కారాల్లో జానపద రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు అంకయ్య కళారత్న (హంస) అవార్డును మంత్రి కందుల దుర్గేష్ చేతులమీదుగా అందుకున్నారు. కళారత్న అవార్డును అందుకొని కావలి కి కీర్తి ప్రతిష్టలు పెంచిన అంకయ్యను ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకుడు గుర్రం సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన దానం అంకయ్య మంగళవారం కావలి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు