డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే..
అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి.. -కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ..
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో, ముసునూరు లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, బుడంగుంట ఇందిరమ్మ కాలనీ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ముసునూరు అంబేద్కర్ పార్క్ లోని విగ్రహం వద్ద ఎమ్మెల్యే మొక్కను నాటారు. పార్కు అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. బ్రిడ్జి సెంటర్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బుడంగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కావలిలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని ఎమ్మెల్యే గారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు..