కావలిలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన
భారీ ఎత్తున హాజరైన కావలి ప్రజానీకం, అధికారులు, ప్రజాప్రతినిధులు. బ్రిడ్జి సెంటర్ నుంచి కావలి ఐకానిక్ పాయింట్ వరకు కొనసాగిన కొవ్వొత్తుల ప్రదర్శన వంద అడుగుల జాతీయ జండా వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు..
ఉగ్రవాద ఘటనలో మృతులకు ఘన నివాళులు వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. ఉగ్రవాద మూకలని ఏరిపారేస్తామన్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్...
భారతదేశం మతసామరస్యానికి ప్రతీక. ఉగ్రవాద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేమంతా కట్టుబడి ఉంటాం ఉగ్రవాదులారా ఖబడ్దార్...
భారతదేశం తలుచుకుంటే ఉగ్రవాద రూపురేఖలు అంతమొందిస్తాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది మధుసూదన్ కు సంఘీభావం చెప్పనివాళ్లు నిజమైన టెర్రరిస్టులు. .
కావలిలో మధుసూదన్ కుటుంబానికి మేము అండగా నిలబడుతాం మధుసూదన్ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించాం