మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ లో మీకోసం క్రికెట్ ట్రోఫీని గెలుపొందిన ముసునూరు వారియర్ టీమ్ సభ్యులకు కావలి ఎమ్మెల్యే వారికి ట్రోఫీ, మెడల్, సర్టిఫికెట్స్ అందజేశారు

 మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి జడ్పీ గ్రౌండ్ నందు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో మీకోసం క్రికెట్ ట్రోఫీని గెలుపొందిన ముసునూరు వారియర్ టీమ్ సభ్యులకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అభినందనలు తెలుపుతూ వారికి ట్రోఫీ, మెడల్, సర్టిఫికెట్స్ గురువారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, దేశ ప్రతిష్టను పెంపొందించాలన్నారు. మీకోసం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ కుమార్ రాయపాటి మాట్లాడుతూ  విద్యార్థులలో ఉన్న క్రీడా నైపుణ్యాలని గుర్తించి అటువంటివారిని ప్రోత్సహించడంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్లో పోటాపోటీగా అన్ని టీములు పోటీ పడగా అంతిమంగా ముసునూరు వారియర్స్ టీం అన్ని విభాగాలలో చక్కగా రాణించి విజయం సాధించడం ద్వారా మీకోసం ట్రోఫీని అందుకోవడం చాలా సంతోషకరమని అన్నారు.

ట్రోఫీని  గెలుపొందిన ముసునూరు వారియర్స్ టీంకు కావలి అభివృద్ధి ప్రదాత, నిత్య ప్రజా సేవకుడు, క్రీడలను ప్రోత్సహించే ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని,మెడల్స్ ను, సర్టిఫికెట్స్ ను ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, టోర్నమెంట్ నిర్వహించిన డానియల్ బాబ్జి, ఎంపైర్స్ గా వ్యవహరించిన ఆర్.డి.ఎస్ నికిత్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin