సీతా రాముల కళ్యాణంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. కావలి పట్టణం జనతాపేటలోని రామాలయం, అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో జరిగిన సీతారాముల కళ్యాణం, సత్యనారాయణ స్వామి గుడిలో జరిగిన కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వార్ల ఆశీస్సులు తీసుకున్నారు. రాముని గొప్పతనం గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు..