కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టిడిపి పార్టీ 43 ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు టిడిపి జెండాని ఎగరవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పించారు, కార్యాలయం వద్ద టిడిపి నేతలు,కార్యకర్తల సందడితో పండగ వాతావరణం నెలకొంది.ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. కావలి నియోజకవర్గంలో పార్టీకి మద్దతుగా నిలుస్తున్న నాయకులకు, ప్రజలకు,అభిమానులకు నా ధన్యవాదాలు.. టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తి.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే.. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు..
కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్,ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు టిడిపి జెండాని ఎగరవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు,టిడిపి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు..