పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణం వైకుంఠ పురం కు చెందిన అన్నం సిద్దయ్య - వరలక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక నలుగు కార్యక్రమం కావలి పట్టణంలోని ఏఎన్ఆర్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి పట్టణం ముసునూరు కు చెందిన బేతి రెడ్డి వెంకట్రావు- లక్ష్మీ దంపతుల కుమార్తె సిరి నలుగు కార్యక్రమం ముసునూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. కావలి పట్టణం వెంగలరావు నగర్ కు చెందిన ఇరువూరి పిచ్చయ్య నాయుడు - రామ తులసి దంపతుల కుమారుడు సందీప్ నలుగు కార్యక్రమం వెంగల రావు నగర్ లోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి పట్టణం ముసునూరు కు చెందిన బేతి రెడ్డి వెంకట్రావు- లక్ష్మీ దంపతుల కుమార్తె సిరి నలుగు కార్యక్రమం ముసునూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు. అనంతరం కావలి పట్టణం 29వ వార్డు నార్త్ జనతాపేటకు చెందిన కన్నం సుబ్బమ్మ ఉత్తర క్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పోట్లూరి శ్రీనివాసులు, తిరివీధి ప్రసాద్, నాయుడు రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..