అనపగుంట పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 12-05-2025

 అనపగుంట పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 12-05-2025

కావలి పట్టణం వైకుంఠపురంలోని అనపగుంట పూడికతీత పనులను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనపగుంట లోకి మురుగునీరు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూడికతీత పనులు వలన సమీపంలోని బావుల నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలు, అధికారులు అందరి సూచనలతో అనపగుంటకు ఒక కొత్త రూపం తీసుకువస్తామని తెలిపారు. డ్రైనేజీ మల్లింపు, అనపగుంట సుందరీకరణ పై అధికారులకు పలు సూచనలు చేశారు..



google+

linkedin