సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే 13-05-2025
ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 18 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.19,94,427 చెక్కులను కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ. 3,78,53,633 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు కావలి నియోజకవర్గంలో పంపిణీ చేశామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4న తేదీ నాటికి సంవత్సరం పూర్తి కావస్తుంది అని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే వివరిస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటివరకు కావలి నియోజ వర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 558 అప్లికేషన్లని ముఖ్యమంత్రి కి పంపడం జరిగిందని, ఈరోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు రావడం జరిగిందని తెలిపారు. కావలి నియోజక వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయం అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పని చేస్తామని తెలిపారు. చాలా మంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆరు నెలలకో, ఏడు నెలలకో మా దగ్గరికి వస్తున్నారని, అలా కాకుండా హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం జరుగుతుందని తెలిపారు. కావలి ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి, ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు, ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేయించుకుంటే ఎంతో కొంత చేయుత నేను ఇస్తానని చెప్పి, ఈ రోజున మన కావలికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..