రైతులకు అండగా కూటమి ప్రభుత్వం 14-05-2025

 రైతులకు అండగా కూటమి ప్రభుత్వం 

రైతుల అభివృద్ధి  చంద్రన్న కే సాధ్యం

మెట్ట ప్రాంతాలకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం ఇదే తొలిసారి సీఎంఆర్ ద్వారా గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి,కాకర్ల సురేష్

నెల్లూరు జిల్లా, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి  రైతన్నలకు ఎన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బుధవారం ఆయన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి  సంఘం వద్ద కావలి కాలువకు నీటిని విడుదల చేశారు. అక్కడికి చేరుకున్న రైతులు మహిళలు  గంగమ్మకు జల హారతులు ఇచ్చారు. కావలి ఉదయగిరి నియోజకవర్గం లోని రైతులు రెండో కారు పంటలు వేసుకునేందుకు 650 క్యూసిక్కుల నీటిని  విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులకు అన్ని విధాల  కూటమి ప్రభుత్వం  అండగా ఉంటుందన్నారు. రైతుల అభివృద్ధి  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే సాధ్యమన్నారు. రెండో కారు పంటకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలకు రైతులు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ తోపాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని మేము అందరం కూడా ఐఏబీలో  తీర్మానం ప్రకారం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.కావలి కాలువ కింద 74 వేల ఎకరాలు అనాధికరికంగా ఇంకో 24 ఎకరాలు ఉందన్నారు. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువులలో సగం చెరువులో నీళ్లు ఉండటంవల్ల  రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగిందన్నారు. మేజర్, మైనర్ల కింద గాని ఉన్న రైతాంగానికి పంటలు పండించుకునేందుకు ఈరోజు వాటర్ విడుదల చేయడం జరిగిందన్నారు..8.7 టీఎంసీల నీటిని కావలి కాలువకు విడుదల చేయడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అధికారులే రైతులని మేము నీరు ఇస్తాం మీరు పంటలు వేసుకోమని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మెట్ట ప్రాంతానికి రెండోసారి పంటలకి నీరు ఇవ్వడం గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. రైతులు నీటిని వృధా చేసుకోకుండా బాధ్యతగా  పంటలకు ఉపయోగించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సీఎంఆర్ ద్వారా 1,25,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సుమారు 3 కోట్ల 83 లక్షల  వ్యయంతో  కాలువలో సిల్క్ రిమూవ్ చేయడం జరిగిందన్నారు. రైతులందరూ కూడా పంటలు సకాలంలో పండించుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మేము అండగా ఉంటామన్నారు.. ఈ కార్యక్రమంలో అధికారులు  కావలి,జలదంకి,సంఘం మండలాల రైతులు, మహిళలు పాల్గొన్నారు.

google+

linkedin