పలువురిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే 16-05-2025
బోగోలు మండలంలో పలువురిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. బోగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు సంజయ్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం తీసుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఎమ్మెల్యే ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించి త్వరగా కోలుకోవాలని తెలిపారు. అలాగే బోగోలు మండలం చెంచులక్ష్మీపురం కు చెందిన కాండ్ర రమ ఇటీవల మృతి చెందారు. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే కప్పరాల తిప్పుకు చెందిన టీడీపీ నాయకులు బాణాల ఎజ్ కెల్ తల్లి విజయమ్మ ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి బుధవారం వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగోళ మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్, చిలకపాటి వెంకటేశ్వర్లు, కండ్లగుంట మధుబాబు నాయుడు, సిద్దు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు